ముందస్తు ఎన్నికలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండబోవని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే మార్చి బడ్జెట్ సమావేశాల అనంతరం అసెంబ్లీ ఎన్నికలు ఉండవచ్చని జోష్యం చెప్పారు. సీఎం కేసీఆర్ కచ్చితంగా ముందస్తుకు వెళతారని అన్నారు జీవన్ రెడ్డి.

సీఎం కేసీఆర్ వ్యవహార శైలి చూస్తే ఖచ్చితంగా ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ప్రతిపక్షాల దృష్టి మరల్చి తన పని తాను చేసుకుంటూ పోవడంలో సీఎం కేసీఆర్ సిద్ధహస్తుడు అనే టాక్ ఉంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తూ ఉండవచ్చు అని  ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడం పై జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టుకోకుండా అవసరమైన పోస్టులు కూడా భర్తీ చేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news