నెట్టింట సెగ‌లుపుట్టిస్తున్న‌ ప‌విత్ర లోకేష్ ఓల్డ్‌ ఫోటోస్‌.. !!

-

పవిత్ర లోకేష్.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. కన్నడ సినీ పరిశ్రమలో కూడా ఈమె పేరే హాట్ టాపిక్. ఎందుకంటే వీకే నరేష్ తో గత కొంతకాలంగా సహజీవనం గడుపుతోందని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఎక్కడికి వెళ్లినా జంటగా వెళ్లడం తో.. కలసి ఓకే ఇంట్లో ఉండడంతో వీరిరువురుపై సర్వత్ర విమర్శలు తలెత్తుతున్నాయి.

ఒకవైపు పవిత్ర లోకేష్ భర్త సుచేంద్ర ప్రసాద్ కూడా ఆమె నా భార్య.. నరేష్ ఎవరో నాకు తెలియదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక మరొకవైపు నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి కూడా తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేష్ ను ఎలా వివాహం చేసుకుంటాడు అంటూ కన్నడ ఇండస్ట్రీలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది

.

ఈ క్రమంలోనే పవిత్ర పేరు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇక పవిత్ర లోకేష్ నటుడు వీకే నరేష్ తో కలిసి ఎన్నో సినిమాలలో జంటగా కలిసి నటించిన విషయం తెలిసిందే. హీరోలకు తల్లిదండ్రులుగా లేదా హీరోయిన్ కి తల్లిదండ్రులుగా నటించి ప్రేక్షకులను బాగా మెప్పించారు.

ఆన్ స్క్రీన్ బెస్ట్ జోడి గా నిరూపించుకున్న వీరు.. ఆఫ్ స్క్రీన్ లో కూడా బెస్ట్ జోడి అనిపించుకోవడానికి ప్రయత్నం చేసే నేపథ్యంలోనే ఇటీవల బాగా రూమర్స్ కు గురి అవుతున్నారు. ఇకపోతే సినిమాలలో పద్ధతికి చీర కట్టినట్టుగా ఎంతో సాంప్రదాయంగా ఉండే పవిత్ర తనకు సంబంధించిన పాత ఫోటోలు మాత్రం ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.

ఇక పవిత్ర లోకేష్ మునుపటి ఫోటోలను కుర్ర కారు కన్నార్పకుండా చూస్తున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల ఆమెకు సంబంధించిన పాత ఫోటోలు బయటకు రాగా ప్రతి ఒక్కరు కూడా ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

పవిత్ర లోకేష్ హీరోయిన్ కటౌట్ కి ఏమాత్రం తీసిపోదని ..ఒక పక్క పొగుడుతూనే ఇంకొకపక్క ఆమె హాట్ అందాలకు.. వయ్యారాల సోయగాలకు కుర్ర కారు ఫిదా అవుతున్నారు. మొత్తానికి అయితే పవిత్ర లోకేష్ హాట్ ఫోటోలు ప్రేక్షకులకు కన్నుల పండుగ అనిపిస్తున్నాయి. సెగలు పుట్టిస్తున్న పవిత్ర లోకేష్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by Pavitra Lokesh (@impavitralokesh)

 

Read more RELATED
Recommended to you

Latest news