OMG..ఆకాశంలో భారీ వంతెన.. నిర్మిస్తున్న భారత్..చూస్తే మతిపోవాల్సిందే..!

-

అరుదైన నిర్మాణాలకు..భారత్ కు పెట్టింది పేరు. మన దేశంలో సింధూ, హరప్పా, మోహెంజోదారో కాలం నుంచే ఎన్నో అద్భుతమైనా కట్టడాలను నిర్మించారు. తాజాగా జమ్మూకాశ్మీర్‌లో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిని చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. ఇది కచ్చితంగా భారత్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెడుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్… ఈ అద్భుతమైన వంతెనకు సంబంధించిన ఓ ఫొటోని కూ యాప్ లో షేర్ చేశారు. “ప్రపంచంలోనే ఎత్తైన ఆర్చి చీనాబ్ బ్రిడ్డి.. మేఘాలపై” అని ఆయన తన పోస్టుకి క్యాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోలో మేఘాలపై పర్వతాలను కలుపుతూ విల్లులాంటి వంతెన నిర్మాణం జరుగుతోంది.
చీనాబ్ రైల్వే బ్రిడ్జి… జమ్మూకాశ్మీర్ లోని రీసీ జిల్లాలోని బక్కల్, కౌరీ మధ్య ఉంది. ఇది 1,315 మీటర్ల పొడవైనది. నదిపై 359 మీటర్ల (1177 అడుగుల) ఎత్తులో ఉంది. ఇది ఎంత ఎత్తులో ఉందంటే… ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఈఫిల్ టవర్ కంటే ఇది 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంది.
బీజేపీ జాతీయ కార్యదర్శి సంబిత్ పాత్ర కూడా ఈ బ్రిడ్జికి సంబంధించిన ఫొటోలను కూ యాప్ లోనే షేర్ చేశారు. విదేశాల్లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఈఫిల్ టవర్ వంటి వాటి గురించి మనం విన్నాం..కానీ మనదేశంలోని ఇలాంటి నిర్మాణాలపై సరైన ప్రచారం జరగట్లేదు. దీని నిర్మాణం పూర్తయ్యాక… బాగా ప్రచారం కల్పిస్తే… కాశ్మీర్ టూరిజం మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.
ఈ వంతెనకి ఉన్న ఆర్టిని 2021 ఏప్రిల్ నాటికి పూర్తి చేశారు. ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. బ్రిడ్జిని రూ.1,486 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ లో భాగంగా రెడీ అవుతోంది. దీన్ని 2022 డిసెంబర్ నాటికి ప్రారంభిస్తారనే అంచనా వేసారు.

Read more RELATED
Recommended to you

Latest news