ఇండియాలో ఇవ్వాళ ఒకే రోజే 3 కొత్త ఓమిక్రాన్ కేసులు.. 26 చేరిన మొత్తం ఓమిక్రాన్ కేసులు

-

భారత్ లో మళ్లీ ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో కేసు నమోదైంది. టాంజానియా నుంచి ముంబైకి వచ్చిన ఓ వ్యక్తికి ఓమిక్రాన్ వేరియంట్ కరోనా సోకిందని అధికారులు ధ్రువీకరించారు. అంతకు ముందు ఇదే రోజు గుజరాత్ లో రెండు కేసులు బయటపడ్డాయ. దీంతో ఇండియాలో ఒకే రోజు మూడు కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఇండియాలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 26కు చేరింది. జింబాబ్వే నుంచి గుజరాత్ జామ్ నగర్ కు వచ్చిన ఎన్ఆర్ఐ ద్వారా ఆయన బంధువుకు కూడా ఓమిక్రాన్ సోకింది. ప్రస్తుతం ఇండియాలో నమోదైన కేసులన్నీ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, టాంజానియా, నమీబియా నుంచి వచ్చన వారికే సోకాయి.

దేశంలో మొదటగా బెంగళూర్ లో 2 ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఆ తరువాత గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీల్లో కేసులు ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 11, రాజస్థాన్ లో 9, గుజరాత్ లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version