ఇండియాలో 41కి చేరిన ఓమిక్రాన్ కేసుల సంఖ్య.. తాజాగా సూరత్ లో మరో కేసు వెలుగులోకి..

-

ఇండియాలో ఓమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. రోజుకు ఏదో ఒక రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా గుజరాత్ లోని సూరత్ నగరంలో మరో ఓమిక్రాన్ కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి ఇటీవల సూరత్ కు తిరిగి వచ్చిన వ్యక్తిలో ఈ వేరియంట్ ను అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు ఇండియాలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 41కి చేరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓమిక్రాన్ పై అలెర్ట్ ఉన్నాయి.

ఇండియాలో రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా మహారాష్ట్రలో ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 20 ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడంతో పాటు, రాజస్థాన్ లో 09, గుజరాత్ లో 04, కర్ణాటకలో 03, ఢిల్లీ లో 02, ఏపీ, కేరళ, ఛండీగడ్ లలో ఒక్కో కేసు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో నమోదైన కేసుల్లో చాలా మంది దక్షిణాఫ్రికా, టాంజానియా, జింబాబ్వే, ఐర్లాండ్ దేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఈ దేశాల నుంచి వచ్చిన వారికి ఎయిర్ పోర్టుల్లోనే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ వస్తే వెంటనే జీనోమ్ సిక్వెన్సింగ్ కోసం శాంపిళ్లను పంపిస్తున్నారు. ఈ పరీక్షలో ఓమిక్రాన్ సోకిందా లేదా అని తెలుసుకుంటున్నారు. ఒక వేళ ఓమిక్రాన్ సోకితే ప్రైమరీ, సెకండరీా కాంటాక్ట్ ల పై అధికారులు నజర్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news