ఖమ్మం, నల్లగొండ ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం…

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తొలి విజయాలను నమోదు చేసింది. స్థానిక సంస్థల కోటాలో జరిగిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ఖమ్మం, నల్లగొండలపై గులాబీ జెండా ఎగిరింది.

ఖమ్మంలో 247 ఓట్ల ఆధిఖ్యంతో తాతా మధు విజయం సాధించారు. ఈ జిల్లాలో మొత్తం 768 ఓట్లు ఉండగా.. 738 ఓట్లు పోలయ్యాయి. వీటిలో తాతా మధుకు 486 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నేత రాయల నాగేశ్వర్ రావుకు కేవలం 239 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో తాతామధు మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఖమ్మం స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. క్రాస్ ఓటింగ్ జరుగుతునందని భావించినప్పటికీ.. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఆపార్టీకే ఓటేశారు.

మరోవైపు నల్లగొండ ఖిల్లాపై గులాబీ జెండా ఎగిరింది. నల్లగొండలో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి విజయం సాధించారు. మొత్తం 1233 ఓట్లలో కోటిరెడ్డి 917 ఓట్లను సాధించారు. స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ జెడ్పీటీసీ నగేష్ కు 226 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో కోటి రెడ్ది గెలుపు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.