ప్రపంచం దేశాలను ఓమిక్రాన్ ధడ పుట్టిస్తోంది. డెల్టా వేరియంట్ కన్నా ఓమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ ఉన్న దేశాలపై ప్రపంచ దేశాలు ట్రావెల్ బ్యాన్ ను విధింస్తున్నారు. ముఖ్యంగా ధక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్ వానా, జాంబియా, లెసాతో, జింబాబ్వే దేశాలపై ఆంక్షలు విధిస్తున్నాయి మిగతా ప్రపంచ దేశాలు.
ఇటు ఇండియాలో కూడా ఓమిక్రాన్ వేరియంట్ పై చర్యలకు ఉపక్రమించింది. తాజాగా తెలంగాణ కూడా ఓమిక్రాన్ నేపథ్యంలో అలెర్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. రేపు క్యాబినెట్ భేటీలో ఓమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. గతంలో కరోనా అనుభవాలను ద్రుష్టిలో పెట్టుకుని ముందుగానే పలు ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. ఇతర దేశాల నుంచి వచ్చే వారిని ముఖ్యంగా ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ విధించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు పబ్ లు, మాల్స్ , థియేటర్లపై నియంత్రణ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు తెలంగాణలోకి వచ్చేవారు ఖచ్చితంగా రెండు డోసులు తీసుకోవడం లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుని నెగిటివ్ ఉన్నవారినే అనుమతించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఓమిక్రాన్ నేపథ్యంలో పలు ఆంక్షలను విధించాయి.