BREAKING NEWS : కేంద్రం కీలక నిర్ణయం… 15-18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్.. ప్రధాని మోదీ వెల్లడి.

-

దేశంలో ఓమిక్రాన్ ఎక్కవ అవుతున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ పై ఎక్కువగా మాట్లాడారు. మరో కీలక నిర్ణయాన్ని కూడా వెల్లడించారు. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్ వేయనున్నట్లు తెలిపారు. జనవరి 3, 2022 నుంచి వీరికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. పాఠశాలకు వెళ్లి మరీ పిల్లలకు వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్లు  వెల్లడించారు. 60 ఏళ్ల వయసువారికి, హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ప్రికాషన్ డోసులను డోసులు కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జనవరి 10,2022 నుంచి వీటిని వెస్తామని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రధాని ప్రజలకు సూచించారు. కరోనా ఇంకా ముగిసిపోలేదన్నారు. మాస్కులను తప్పని సరిగా వాడాలని ప్రజలకు సూచించారు ప్రధాని మోదీ. ప్రజలు తమంతట తాముగా ముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు. దేశంలో 141 కోట్ల డోసుల వ్యాక్సినేషన్లు ఇచ్చామని మోదీ తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో వందశాతం మొదటి వ్యాక్సిన్ డోసు కూడా పూర్తియినట్లు వెల్లడించారు. ప్రపంచంలో తొలిసారిగా.. డీఎన్ ఏ ఆధారిత వ్యాక్సిన్ ను కూడా తీసుకురానున్నట్లు వెల్లడించారు ప్రధాని.

Read more RELATED
Recommended to you

Latest news