తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడ గానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులతో చర్చించడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఢిల్లీకి వెళ్లారు.
దాదాపు వారం రోజుల పాటు మంత్రి ఎర్రబెల్లి ఢిల్లీ లోనే ఉన్నారు. నిన్న రాత్రి మంత్రి ఎర్రబెల్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. అయితే ఈ రోజు ఆయన ఆస్వస్థత కు గురి కావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆయనకు పాజిటివ్ వచ్చింది. కాగ ఢిల్లీ పర్యటనకు మంత్రి ఎర్రబెల్లితో పాటు.. మంత్రులు నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్, పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు, రాజ్యసభ పక్ష నేత నామ నాగేశ్వర రావుతో పాటు మరి కొంత మంది కూడా ఉన్నారు. అయితే ఇందులో మంత్రి ఎర్రబెల్లికి కరోనా పాజిటివ్ తేలింది.