ఈశాన్య రాష్ట్రాలకు ఒమిక్రాన్.. తొలి కేసు నమోదు

-

కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఈశాన్య రాష్ట్రాలకు పాకింది. సోమవారం మణిపూర్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాకు చెందిన 48ఏండ్ల వ్యక్తి ఇటీవల టాంజానియా నుంచి ఢిల్లీ మీదుగా ఇంఫాల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అతను స్వదేశానికి వచ్చిన ఎనిమిది రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

టాంజానియా నుంచి రాష్ట్రానికి చేరుకోగానే డిసెంబర్ 21న ఆ వ్యక్తి నుంచి నమూనాలు సేకరించామని మణిపూర్ హెల్త్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ఇంఫాల్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోరిసోర్సెస్ అండ్ సబ్‌స్టెయినబుల్ డెవలప్‌మెంట్ (ఐబీఎస్‌డీ)‌కు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించామని తెలిపారు. సోమవారం వచ్చని ఫలితాల ప్రకారం ఆ వ్యక్తికి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news