భారత దేశంలో ఓమిక్రాన్ XE వైరస్ వెలుగు చూసిందని దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందారు. విదేశాల్లో ఓమిక్రాన్ XE కారణంగా భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడంతో.. ప్రజలు భయాందోళన చెందారు. ఓమిక్రాన్ XE వేరియంట్ మన దేశంలో ముంబై నగరంలో వెలుగు చూసింది. కాగ దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఓమిక్రాన్ XE వేరియంట్ సోకిన వ్యక్తి ప్రస్తుతం పూర్తి కోలుకున్నాడని మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే ప్రకటించారు.
ఓమిక్రాన్ XE వేరియంట్ సోకిన వ్యక్తి ఫస్ట్ కాంటాక్ట్ అయిన వారి శాంపిల్స్ ను కూడా పరీక్ష చేశామని ఆయన తెలిపారు. అందరికీ కూడా నెగిటివ్ అని వచ్చిందని వెల్లడించారు. మరింత క్లారిటీ కోసం ఎన్ఐబీఎంజీకి వారి శాంపిల్స్ ను పంపించామని తెలిపారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఓమిక్రాన్ XE వేరియంట్ ఇక ముంబైలో లేదని అన్నారు. ఎన్ఐబీఎంజీ నుంచి పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు.