ఐపీఎల్ 2022 లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య 15వ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాగ ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మెగా వేలంలో కొనుగోలు చేసిన డేవిడ్ వార్నర్ పై అంచనాలు భారీగా ఉండేవి. ఆస్ట్రేలియా క్రికెట్ నిబంధనల వల్ల తొలి మ్యాచ్ లకు దూరం అయిన డేవిడ్ వార్నర్.. నేటి మ్యాచ్ కు అందుబాటులో ఉన్నాడు. లక్నో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోవడంతో.. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తుంది.
అయితే ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ బ్యాట్ నుంచి పరుగుల వరద రావడం ఖయం అని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ డేవిడ్ వార్నర్ అభిమానులను నిరాశ పర్చుతూ.. కేవలం 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. 12 బంతులు ఆడిన వార్నర్ కేవలం 4 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్ లో ఆయూశ్ బదోనికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
కాగ డేవిడ్ వార్నర్.. గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడిన విషయం తెలిసిందే. వరసగా విఫలం కావడంతో వార్నర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తప్పించింది. వేలంలోనూ కొనుగోలు చేయలేదు. దీంతో సన్ రైజర్స్ యాజమాన్యం పై ఫ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీజన్ లో వార్నర్ దూకుడుగా ఆడాలని కోరుకున్నారు. కానీ వార్నర్ తొలి మ్యాచ్ లో అందరినీ నిరాశపర్చాడు.