పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ”ఆదిపురుష్”. ఇది వచ్చే సంక్రాంతి కానుక గా రిలీజ్ చేద్దామని అనుకుంటే గ్రాఫిక్స్ వర్క్ కోసం రిలీజ్ వచ్చే సంవత్సరం జూన్ కు వాయిదా వేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాల తో వుంటే ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన టీజర్ లో గ్రాఫిక్స్ నాసిరకం అని సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు. అలాగే చాలా మంది హిందూ దేవుళ్లను కించ పరిచేలా వుందని విమర్శించారు.ఈ సినిమా గ్రాఫిక్స్ క్వాలిటీ విషయంలో మళ్లీ VFX వారితో మాట్లాడి, మంచిగా వచ్చేలా చేయటం కోసం డైరెక్టర్ ఓం రౌత్ నిర్మాత తో మాట్లాడి మరో వంద కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇక ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ పై మరోసారి ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిపురుష్ గ్రాఫిక్స్ విషయంలో గట్టిగా ట్రోల్స్ వినిపిస్తున్నాయి. తాజాగా గా రిలీజ్ అయిన హీరో తేజ,హనుమాన్ మూవీ టీజర్ తో పోలుస్తూ నెటిజన్స్ కామెంట్స్ తో విరుచుకు పడ్డారు .హనుమాన్ అనేది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా. అఫీషియల్ టీజర్ ఈ రోజే రిలీజ్ అయ్యింది. అయితే ఈ మూవీ టీజర్ లో గ్రాఫిక్స్ , విఎఫ్ ఎక్స్ విషయంలో ప్రజంటేషన్ అద్భుతం అంటూ సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు. నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా కూడా చివరకు కంటెంట్ మరియు క్వాలిటీ మాత్రమే మాట్లాడతాయి అని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ ప్యాన్స్ ఈ ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలో అని తీవ్రంగా ఆలోచిస్తున్నారట.