మరోసారి మంచు విష్ణును ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!!

టాలీవుడ్ లో మంచు కుటుంబం ది ఒక ప్రత్యేక మైన గుర్తింపు వుంది. ఒకప్పుడు ఈ ఫ్యామిలీ పై అందరూ గౌరవం తో వుండే వారు.రాను రాను వారి సెల్ఫ్ డబ్బా ఎక్కువ అయ్యింది అని , కొంత బిహేవియర్ ప్రాబ్లమ్స్ వల్ల మరియు సినిమాలలో కంటెంట్ సరిగా లేకపోవటం తో వారి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రీసెంట్ గా దీపావళి కు వచ్చిన మంచు విష్ణు  చిత్రం   జిన్నా కూడా ప్లాప్ అయ్యింది.

అందాల ముద్దగుమ్మలు పాయల్ రాజ్ పుత్, సన్ని లియోన్లు వున్నా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది.ఈ సినిమా కోసం  ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసినా, మరీ తీసి వేయదగ్గ సినిమా కాకపోయినా, రివ్యూ లు కూడా పరవాలేదు అన్నా కూడా ప్రేక్షకులు సినిమా ను చూడలేదు. కలెక్షన్స్ మరీ దారుణం అని సోషల్ మీడియాలో ట్రొలర్స్  కామెంట్స్  హల్చల్ చేశాయి.

ఇప్పుడు మరోసారి మంచు విష్ణు ను ట్రొల్ చేస్తున్నారు. నిన్న శుక్రవారం నాడు సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు దాదాపు కోటి రూపాయల వసూళ్లు సాధించింది అనే న్యూస్ ఇప్పుడు విష్ణు పై కామెంట్స్ కు కారణం అయ్యింది. బాక్ గ్రౌండ్ లేని హీరోనే విష్ణు సినిమా కంటే ఎక్కువ వసూళ్ళు సాధించాడు అంటూ సోషల్ మీడియాలో మరో సారి తగులు కున్నారు