నేడు హైదరాబాద్ లో ”గంటా నలభై ఆరు నిముషాలు” చంద్రగ్రహణం..!

-

ఖగోళ, జోతిష్య శాస్త్రాల్లో సూర్య, చంద్ర గ్రహణాలకు ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలుసు. కార్తీక పౌర్ణమి రోజు చంద్ర గ్రహణం వచ్చింది. నవంబర్ ఎనిమిది అనగా నేడు చంద్రగ్రహణం. ఈ రోజు మధ్యాహ్నం గ్రహణం 2 గంటల 39 నిమిషాల కి మొదలవుతుంది.

గ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకు ఉంటుంది. ఈ చంద్ర గ్రహణం సూతక కాలం ఉదయం 5 గంటలు 39 నిమిషాల్నించి ఉంటుంది. అయితే ఈ గ్రహణాన్ని అశ్వని, భరణి, కృత్తికా నక్షత్రాల వారు చూడరాదు. మేష రాశి వారు ఈ గ్రహణం చూడకూడదు. ఇక ఈ గ్రహణం మేష రాశి వారి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనేది చూద్దాం. మేష రాశి జాతకులకు ఈ గ్రహణం వలన మానసిక సంఘర్షణ ఉంటుంది.కనుక జాగ్రత్తగా ఉండాలి. కానీ ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు.

రక్తపోటు సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఉద్యోగస్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్ లో గ్రహణం పాక్షికంగా కనపడనుంది. హైదరాబాద్ లో చంద్ర గ్రహణం 5:40 కి మొదలు కానుంది. ఇది 7:20 కి ముగుస్తుంది. గంటా నలభై ఆరు నిముషాలు హైదరాబాద్ లో కనపడుతుందిట. శ్రీ శుభకృత్ నామసంవత్సరం మార్గశిర శుద్ధ పూర్ణిమ నవంబరు 8 మంగళ వారం భరణి నక్షత్రం మూడో పాదంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం వస్తుంది.

స్పర్శ కాలం మధ్యాహ్నం 2:38
మధ్య కాలం మధ్యాహ్నం 4:28
మోక్ష కాలం సాయంత్రం 6:18
ఆద్యంత పుణ్యకాలం 3:40

Read more RELATED
Recommended to you

Latest news