జీవితంలో మనకి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే జీవితంలో ఈ పనులు చేయకపోతే వారి జీవితం వ్యర్థం అని ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా చెబుతున్నారు. ప్రతి ఒక్కరు వారి యొక్క జీవితంలో ఇలాంటి పనుల్ని తప్పక చేయాలని ఆచార చాణక్య చెప్పారు వీటిని కనక జీవితంలో ఆచరించకపోతే వారి జీవితం వ్యర్థం అని అంటున్నారు. మరి ఎటువంటి వాటిని తప్పనిసరిగా జీవితంలో ఫాలో అవ్వాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
విజయవంతమైన జీవితాన్ని గడపాలంటే ఆలోచనలో మార్పు రావాలి. మానవ సంబంధాల విషయంలో కచ్చితంగా నిజాయితీ ఉండాలి అని చాణక్య నీతి ద్వారా చాణక్య చెప్పారు. విజయవంతమైన జీవితానికి ఇది చాలా అవసరం అని అన్నారు.
అలానే ప్రతి ఒక వ్యక్తికి కూడా కరుణ ఉండాలి కఠినమైన వ్యక్తులు జీవితంలో అన్నిటినీ కోల్పోతారని అన్ని రంగాల్లో కూడా నష్టపోతారని చాణక్య చెప్పారు. పైగా ఎప్పుడూ కూడా ఇతరులను గౌరవించడం చాలా ముఖ్యమని ఆచార్య చాణక్య చెప్పారు. ఇలాంటి వారు కుటుంబంలో ఉంటే వారి కుటుంబానికి నష్టం అని చెప్పారు.
అలానే దానధర్మాలు చేయడం మతాన్ని ఆచరించడం చాలా ముఖ్యమని ఆచార చాణక్య చెప్పారు. ఇవి లేని వ్యక్తి జీవితం వ్యర్థం అన్నారు కనుక మనిషి తన జీవితంలో కచ్చితంగా వీటిని ఆచరిస్తూ ఉండాలి లేకపోతే ఆ జీవితం వ్యర్థం.