పోస్ట్ ఆఫీస్ నుండి సూపర్ స్కీమ్స్… రూ.1.5 లక్షల ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ మొదలు ఎన్నో లాభాలు..!

-

చాలా మంది వారికి నచ్చిన పథకాల్లో డబ్బులని పెడుతున్నారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మంచిగా లాభాలని పొందడానికి అవుతుంది. చాలా మంది భవిష్యత్తు లో ఏ ఇబ్బంది కూడా రాకూడదని స్కీమ్స్ లో డబ్బులని పెడుతున్నారు. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవాలని అంతా చూస్తున్నారు. మీరు కూడా అలానే చూస్తున్నారా..? అయితే ఈ స్కీమ్స్ వివరాలు చూడాల్సిందే. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకోవాలని అంతా చూస్తూ వుంటారు. అందుకు వివిధ ఫైనాన్షియల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో మనీ ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కానీ సరైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

కానీ ఈ స్కీమ్స్ లో కనుక డబ్బులు పెడితే మంచిగా ఆదాయం వస్తుంది. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఇక మరి ఆ స్కీమ్స్ కి సంబంధించి వివరాలు చూద్దాం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ సేవింగ్స్‌ ప్లాన్‌ ని ఇండియా పోస్ట్‌ అందిస్తోంది. కేంద్రం దీనికి సపోర్ట్ గా వుంది కూడా. ఐదేళ్లు మెచ్యూరిటీ పీరియడ్‌ తో వస్తుంది. దీనిలో ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. లిమిట్ ఏమి లేదు. కనీసం రూ.100తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ తో కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. 60 ఏళ్లు నిండిన వారి కోసం ఇండియా పోస్ట్ దీన్ని తీసుకొచ్చింది.

ఐదు సంవత్సరాల టెన్యూర్‌తో వస్తుంది ఇది. మెచ్యూర్ అయిన తర్వాత మరో మూడు సంవత్సరాల వరకు ఎక్స్‌టెండ్‌ చెయ్యచ్చు. దీనిలో మీరు మినిమం రూ.1,000, మ్యాక్సిమం రూ.15 లక్షలు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ని పొందొచ్చు. 1961 ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ని సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ తో పొందవచ్చు. కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు ఇన్వెస్ట్‌ చేయవచ్చు. ఆడపిల్లల భవిష్యత్తు కోసం దీన్ని తీసుకు వచ్చారు.

అలానే టైమ్ డిపాజిట్ అకౌంట్‌ ని కూడా ఇండియా పోస్ట్ తెచ్చింది. గరిష్ట పరిమితి లేకుండా కనిష్టంగా రూ.1000, రూ.100 మల్టిపుల్స్‌లో దీనిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆదాయ పన్ను సెక్షన్ 80C ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ ని ఈ స్కీమ్ తో కూడా పొందవచ్చు. అదే విధంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) తో కూడా ఆదా చేసుకోవచ్చు. PPF కింద సంవత్సరానికి 7.1% వడ్డీ రేటు లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టం 80C కింద రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్‌ డిడక్షన్‌ క్లెయిమ్‌ చేయవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news