హాట్ సమ్మర్​లో.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కూల్ కూల్ హెల్మెట్స్

-

ఎండా వాన, పగలూ రాత్రి లేకుండా ట్రాఫిక్ పోలీసులు రహదారులపై విధులు నిర్వహిస్తూ ఉంటారు. దుమ్మూధూలి అనే తేడా లేకుండా తమ విధుల్లో నిమగ్నమవుతూ ఉంటారు. ఇక ఎండా కాలం అయితే వీరి తిప్పలు చెప్పతరం కాదు. మండుటెండల్లోనూ నిబద్ధతతో విధులు నిర్వహిస్తారు. అయితే వేసవిలో ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు గమనించిన ఉన్నతాధికారులు ఓ ఉపాయం ఆలోచించారు.

హైదరాబాద్న గరంలో వేసవిలో ప్రధాన రహదారుల కూడళ్ల వద్ద విధులు నిర్వహించే ట్రాఫిక్‌ సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఏసీ హెల్మెట్లు రూపొందించారు. రాచకొండ సీపీ వీటిని రెండు రోజుల క్రితం ప్రయోగాత్మకంగా కొంత మంది సిబ్బందికి అందజేశారు. బ్యాటరీతో నడిచే ఈ హెల్మెట్‌.. లోపల, ముఖానికి, మూడు వైపుల నుంచి చల్లని గాలి వీచేలా తయారు చేశారు. దీనిలోని బ్యాటరీని అరగంట పాటు ఛార్జింగ్‌ చేస్తే 3 గంటల పాటు వస్తుంది. హెల్మెట్ల పనితీరు బాగుంటే మిగిలిన కానిస్టేబుల్స్‌కు అందించాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news