తెలంగాణాలో మరొకరికి కరోనా వైరస్…!

-

తెలంగాణాలో మరొకరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రకటన చేసారు. శాసన సభలో శనివారం మాట్లాడిన ఆయన కరోనా వైరస్ నుంచి తెలంగాణా సేఫ్ గా ఉందని ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ 65 మందికి సోకిందని కెసిఆర్ పేర్కొన్నారు. ఆ 65 మందిలో విదేశీయులు 17 మందని చెప్పారు.

వారిలో 10 మందికి జబ్బు నయం అయ్యిందని వివరించారు. వాళ్లను డిశ్చార్జి చేసినట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణలో గాంధీ ఆస్పత్రి నుంచీ ఓ యువకుడికి వైరస్ తగ్గిపోవడంతో డిశ్చార్జి చేశామని చెప్పారు. ఇప్పటివరకూ ఇండియాలో ఇద్దరు మాత్రమే కరోనా వైరస్ వల్ల చనిపోయినట్లు ఆయన వివరించారు. చరిత్రలో ఇలాంటి వైరస్‌లు చాలాసార్లు దాడి చేశాయని… వైరస్‌లు దేశాల మధ్య వ్యాపిస్తూ ఉంటాయన్నారు.

ప్రస్తుతానికి తెలంగాణ సేఫ్‌గా ఉందని అన్నారు. ఇటలీ నుంచీ వచ్చిన ఓ వ్యక్తికి మాత్రం కరోనా పాజిటివ్ అని తేలిందని, ఆ వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ట్రీట్‌మెంట్ అందుతోందని చెప్పారు. మరో ఇద్దరిపై కూడా అనుమానం ఉందని, వారి శాంపిల్స్ పుణె ల్యాబ్‌కి పంపినట్లు వివరించారు. బయటి నుంచీ వచ్చే వ్యక్తుల వల్లే తెలంగాణలో కరోనా వైరస్ వస్తుందని కెసిఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయని అన్నారు. అంతటా షట్ డౌన్ అవుతోందని చెప్పారు. ఫంక్షన్లు కూడా జరపట్లేదన్నారు. కరోనాపై తెలంగాణలో హైలెవెల్ మీటింగ్ జరుగుతోందని, తెలంగాణలో ఏం చెయ్యాలనేది ఆ మీటింగ్ చర్చిస్తోందని వివరించారు. నా, దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని కేంద్రం రద్దు చేసిందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news