మెడికల్ బోర్డు, ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో జూమ్ ద్వారా మంత్రి హరీశ్ రావు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైన వైద్య పరికరాలు వెంటనే సమకూర్చాలని కుటుంబ సంక్షేమ కమిషనర్ కు ఆదేశించారు. అంతేకాకుండా తగిన పరికరాలు, సదుపాయాలు ఉన్న ఆసుపత్రుల్లో చికిత్సల సంఖ్య పెంచాలి, మరింత ఎక్కువ మంది పేషెంట్లకు సేవలు అందించాలని ఆయన సూచించారు.
మీ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి, గుర్తించిన పేషెంట్లకు అవసరమైన చికిత్స అందించాలి. క్యాంపుల నిర్వహణలో ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. ఆరోగ్య శాఖలో 1326 పోస్టులకు భర్తీకి త్వరలో మొదటి దశ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలంటూ.. ఆ దిశగా మెడికల్ బోర్డుకు మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలని సూచించిన మంత్రి హరీష్ రావు.. కరోనా కాలంలో సేవలందిచిన ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 20శాతం వేయిటీజీ అని తెలిపారు.