త్వరలో లాంచ్‌ కానున్న వన్‌ప్లస్ 11 5జీ.. లీకైన ఫీచర్స్..!

-

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వన్‌ప్లస్‌ ఫోన్లకు ఉన్న క్రేజ్‌ వేరు.. చైనాకి చెందిన ఈ కంపెనీ అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్‌లను అందిస్తోంది. తాజాగా ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్ 11 5జీని జనవరి 4న చైనాలో లాంచ్ చేయనుంది. అయితే ఈ హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్‌లో ఇప్పటికే వైరల్‌ అవుతున్నాయి. లీకుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

క్లాసిక్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌

వన్‌ప్లస్ 11లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. మెరుగైన కలర్ గ్రేడింగ్, ఓవరాల్ క్వాలిటీ కోసం కెమెరా సెటప్ హాసెల్‌బ్లాడ్ నుంచి తీసుకోనే అవకాశం ఉంది. రియర్ కెమెరా సెటప్ వృత్తాకారంలో ఉన్నట్లు టీజర్ ద్వారా తెలుస్తోంది. వన్‌ప్లస్ 11 క్లాసిక్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో రానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ గ్లోసీ ఫినిష్‌తో గ్లాస్ బ్యాక్‌ ఫీచర్‌తో రావచ్చు.

ట్రిపుల్ కెమెరా సెటప్..

ఇప్పటివరకు మిస్టరీగా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్‌ను పాపులర్ లీకర్ ఇవాన్ బ్లాస్ పూర్తిగా లీక్ చేశారు. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.. 50 మెగాపిక్సెల్ సోనీ IMX890 మెయిన్ కెమెరా ఉండనుంది. అంతేకాకుండా ఈ హ్యాండ్ సెట్ న్యూ‌రెండర్స్, కలర్ ఆప్షన్స్ వివరాలను ఇవాన్ బ్లాస్ లీక్ చేశారు.

వన్‌ప్లస్ 11 5జీ స్పెసిఫికేషన్స్‌ (అంచనా)

వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల QHD+ AMOLED స్క్రీన్‌‌తో లాంచ్ కావచ్చు.
100W క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీ ఇందులో ఉండే అవకాశం ఉంది.
ఆప్టిక్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో ట్రిపుల్-కెమెరా సెటప్‌ ఉండనుంది.
ఇందులో ప్రైమరీ 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సార్, 48-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 32-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉండనున్నాయి.
ఫోన్ ముందువైపు సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
వన్‌ప్లస్‌ 11 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్స్‌లో లాంచ్ కావచ్చు. బేసిక్ వేరియంట్12GB + 256GB, మరోటి 16GB+256GB, టాప్ వేరియంట్ 16GB+512GB గా ఉండే అవకాశం ఉంది.
వన్‌ప్లస్11 5G ఇన్-బాక్స్ కంటెంట్‌ల్లో ఫోన్, ప్రొటెక్టివ్ కవర్, SIM ఎజెక్టర్ పిన్, ఛార్జర్, పేపర్‌వర్క్, USB టైప్-సి ఛార్జింగ్ కేబుల్ ఉండనున్నాయి.
ఎలిమెంట్స్ నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ హ్యాండ్‌సెట్ IP54 రేటింగ్‌ ఫీచర్‌తో రావచ్చు.
ఇది కలర్ OS 13.0పై రన్ అవుతుందని బ్లాస్ అంచనా వేశారు.
వన్‌ప్లస్ 11 5జీ ఇండియాలో ఫిబ్రవరి 7వ తేదీన లాంచ్ కానుంది.
ఇది ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్‌పై రన్ అవుతుందని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news