ప్రతీ ఒక్కరికీ కూడా ఈరోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఉద్యోగులకి అయినా వ్యాపారులకు అయినా సరే బ్యాంకు అకౌంట్ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఉంటే లోన్స్ వస్తాయి. FDలపై ఎక్కువ మొత్తంలో వడ్డీ రేట్లు ఇస్తుంటారు. పైగా అన్నింటి కంటే కూడా అకౌంట్ ఉండడం వలన డబ్బులు సేఫ్ గా ఉంటాయి. అయితే కొంత మందికి బ్యాంక్ కి వెళ్లి అకౌంట్ ని ఓపెన్ చేసుకోవడానికి టైం ఉండదు.
అలాంటి వాళ్ళ కోసం SBI ఓ సరికొత్త ఆప్షన్ ని తీసుకొచ్చింది. మీ ఇంట్లో ఉండి కానీ ఆఫీస్ లో ఉండి కానీ ఆన్‌లైన్‌లో సులువుగా సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసేయచ్చు. ఇన్‌స్టా సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకునే సౌలభ్యం ని స్టేట్ బ్యాంక్ కలిపిస్తోంది.
దీనితో అకౌంట్ ని ఓపెన్ చెయ్యాలని అనుకునే వాళ్ళు ఈజీగా అకౌంట్ తెరవచ్చు. అలానే రూపే ATM/డెబిట్ కార్డు ను అందిస్తోంది. ఇక ఇప్పుడు మనం ఆన్ లైన్ లో ఎలా అకౌంట్ ని ఓపెన్ చెయ్యచ్చో చూసేద్దాం.
ముందు మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యోనో ఎస్‌బీఐ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చెయ్యండి.
ఇప్పుడు New to SBI Savings Account మీద నొక్కి.. Without Branch Visit మీద నెక్స్ట్ క్లిక్ చేయండి.
Insta plus Savings Account అని ఉంటుంది. ఇప్పుడు మీరు దీనిని ఓపెన్ చేయాలి.
ఆ తరవాత పాన్ కార్డు, ఆధార్ కార్డు డీటెయిల్స్ ఇచ్చేయండి.
మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
ఆ తరవాత అడిగిన వివరాలని ఫిల్ చేయాలి.
వీడియో కాల్‌ను షెడ్యూల్ చేసుకోవాలి.
మీరు వీడియో కాల్ షెడ్యూల్ చేసిన టైం కి YONO SBI యాప్ ఓపెన్ చెయ్యండి.
వీడియో కేవైసీ ప్రక్రియ కంప్లీట్ చేసేయాలి.
ఇలా మీరు అకౌంట్ ని ఓపెన్ చేసేసుకోవచ్చు.