ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం లోటు బడ్జెట్‌తో కటకటలాడుతోంది. కనీసం స్కీమ్‌లను అమలు చేయడానికి కూడా ఈ కరోనా టైమ్‌లో డబ్బుల్లేక ఆస్తులు అమ్మేందుకు సిద్ధమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్కారు భూమలును అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ టైమ్‌లో కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు కొత్త కార్లను పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇదే ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది. ఓ వైపు అప్పులు తట్టుకోలేక భూములు అమ్ముతూ మరోవైపు ప్రజాధనం వృథా చేస్తూ ఈ టైమ్‌లో కార్ల పంపిణీ ఎందుకని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అటు ప్రజలతో పాటు ఇటు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
ఇక దీనిపై మొన్నటి వరకు కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా విజయశాంతి కూడా దీనిపై స్పందించారు. భూముల అమ్మకంపై ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్ రావు చెబుతున్న సమాధానం పొంతన లేకుండా ఉందని వాపోయారు. దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఇప్పుడు భూములమ్మడం దేనికంటూ ప్రశ్నించారు. ఈ కరోనా సమయంలో కోట్ల విలువైన కార్లు పంచడం దేనికంటూ మండిపడ్డారు. మొత్తానికి కేసీఆర్ చేసిన ప్రతి పని ఈ మధ్య విమర్శలకు దారి తీస్తోంది.