తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు డబ్బులు ఇలా చెక్ చేసుకోండి..!

-

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెబుతోంది ప్రభుత్వం. తెలంగాణ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కింద రైతులకి రూపాయలు 5000 ఒక ఎకరం చొప్పున ఇస్తోంది. రైతుబంధు స్కీమ్ కింద ఈ డబ్బులు రైతులకు అందుతున్నాయి.

స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు మంగళవారం నాడు ఈ విషయాలను చెప్పారు. ఎటువంటి ఆలస్యం లేకుండా రైతులకు మేము ఈ డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటున్నాము అని అయితే కరోనా వైరస్ వలన పోయిన ఏడాది ఇవ్వలేక పోయాము అని చెప్పారు.

ఇదిలా ఉంటే స్టేట్ అగ్రికల్చర్ మినిస్టర్ నిరంజన్ రెడ్డి నల్గొండ లో ఎక్కువ మంది రైతులు ఉన్నారని.. మెడ్చర్ల-మల్కాజ్గిరి లో తక్కువ మంది రైతులు ఉన్నారని అన్నారు. నిరంజన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కి కృతజ్ఞతలు తెలియజేశారు.

కరోనా మహమ్మారి సమయంలో రైతులు ఈ డబ్బులు వల్ల మరింత ప్రయోజనం పొందుతారని చెప్పారు. జూన్ 25 నాటికి రైతులు బ్యాంకు ఖాతాలో డబ్బులు పడతాయి. 59.26 లక్షల మంది రైతులు ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందుతున్నారు.

ఈ డబ్బుల్ని ఇలా చెక్ చెయ్యండి:

డబ్బుల్ని చెక్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి
మెనూ బార్ మీద రైతుబంధు స్కీమ్ డీటెయిల్స్ అని ఉంటాయి. అక్కడ క్లిక్ చేసి..
సంవత్సరం, టైప్ మరియు పిబిబి నంబర్ ని టైప్ చేయండి.
ఆ తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి.

లేదా

మీరు రైతు బంధు పేమెంట్ స్టేటస్ కోసం IFMIS వెబ్ సైట్ కి వెళ్లి
సంవత్సరం, టైపు, PPB నెంబర్ ని టైప్ చేసి సబ్మిట్ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news