చేతకాకనే.. డిల్లీలో డ్రామాలు : టీఆర్ఎస్ పై ష‌ర్మిల ఫైర్‌

-

చేతకాక డిల్లీలో డ్రామాలు చేస్తున్నారని వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. రైతు ఆవేదన యాత్ర మూడో రోజులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో ప‌ర్య‌టించారు వైఎస్ షర్మిల. ఈ సంద‌ర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. వరి వద్దన్న ముఖ్యమంత్రి వద్దని.. పరిపాలన చేయడం చేతకాక ధర్నాలు చేస్తున్నారని ఆగ్రహించారు.

ఇవి ఆత్మహత్య లు కావు, ముమ్మాటికీ కెసిఆర్ చేసిన హత్యలేన‌ని నిప్పులు చెరిగారు. రుణమాఫి అవుతుంది, అప్పులు కట్టద్దన్న కేసిఆర్ మాటలు విని అప్పులపై బ్యాంకులో వడ్డీలు పెరిగి రైతులు అప్పులపాలయ్యారని వైఎస్ ష‌ర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రైతుల పంట కొనలేని ముఖ్యమంత్రి మనకొద్దని.. రైతు బంధు ఒక్కటి ఇచ్చి, రైతులకిచ్చే మిగితా పథకాలన్నీ ఆపేశారని వైఎస్ ష‌ర్మిల ఆగ్ర‌హించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని.. అధికారం అనుభవిస్తే సరిపోదు, సిగ్గుండాలన్నారు. వరి కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన‌ని వైఎస్ ష‌ర్మిల చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news