మొక్క జొన్న లో ఎరువుల యాజమాన్యం..!!

-

మన తెలుగు రాష్ట్రాల్లో మొక్క జొన్న పంటను ఎక్కువగా పండిస్తున్నారు.సుమారుగా సూ 2.8 లక్షల హెక్టార్లలో సాగుచేస్తున్నారు.ఖరీఫ్ పోలిస్తే రబీలో పురుగులు, తెగుళ్ళ ఉధృతి తక్కువగా ఉండి, దిగుబడి ఎక్కువగా ఉండడమే కాకుండా ధాన్యానికి ధర కూడా ఎక్కు వగా పలుకుతుంది. పచ్చిచొప్పకు కూడా గిరాకి ఉంటుంది. తక్కువ రోజుల్లో ఎక్కువ దిగుబడినిచ్చే పంటల్లో మొక్కజొన్న ముఖ్యమైంది. ఒక ఎకరం వరి పండించడానికి అవసరమైన నీటితో రెండున్నర ఎకరాల మొక్కజొన్నను పండించవచ్చు. భూసార పరీక్షను అనుసరించి నిర్దేశించిన మోతాదులో సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం వల్ల రైతులు ఎరువులపై పెట్టే ఖర్చుని తగ్గించుకొని అధిక దిగుబడులు పొందవచ్చు..

రబీలో ఎకరాకు న్న 25 కిలోల భాస్వరం ఎరువ వేయాలి. భాస్వరం పైరు తొలిదశ లో అత్యవసరం, ఈ దశలో మొక్క తీసుకున్న భాస్వరమే పంట గుణాలన్నీ బరువు నిర్ధారిస్తుంది. ఈ ధాతువు వేర్లు అభివృద్ధికి ఉపయోగంతుంది.

ఎకరాకు 32 కిలోల చొప్పున ఆఖరి దుక్కిలో, విత్తే ఆకుక సమయంలోను, మిగతా సగం పొటాష్ విత్తిన 50-55 రోజుల మధ్య పసుపు క్కలు వేసుకోవాలి.

మొక్కజొన్న పంట దిగుబడిలో జింకా పాత్ర గణనీయంగా ఉంటుంది. భూమిలో జింక్ లోపం ఉన్నప్పుడు 5 లేదా 6 ఆకుల దశలో మొక్కలో లక్షణాలు కనిపిస్తాయి. ఆకులపై పాలిపోయిన పసుపు, తెలుపురంగు చారలు ఏర్పడ తాయి. కొత్తగా వచ్చిన ఆకులకు జింక్ అందక పోవడంతో దాదాపు తెల్లగా మారుతాయి.జింక్ లోపం కనిపిస్తుంది. మొక్కల్లో జింక్ లోప నివారణకు 2 గ్రా. జింక్ సల్ఫేట్ ను ఒక లీటరు నీటికి చొప్పున కలిపి వారంరోజుల్లో రెండు సార్లు పిచికారి చేయాలి..

80 నుంచి 96 కిలోల నత్రజని ఎరువును వేసుకోవాలి. ఈ నత్రజని ఎరువును 1/4 వంతు విత్తేటప్పుడు, 1/4 వంతు 25-30 రోజులప్పుడు, 1/4 వంతు 45-50 రోజుల మధ్య, మిగిలిన 1/4 60-65 రోజులకు వేయాలి. మొక్కజొన్న తొలి పంటదశలో నత్రజని లోపం ఏర్పడితే మొక్క మొత్తం పాలిపోయి పసుపుపచ్చ రంగులోకి మారుతుంది. ముందుగా ముదురు ఆకుల్లో కొసల నుంచి పసుపు పచ్చగా మారుతుంది.నత్రజని లోపం వల్ల కండెలు చిన్నగా తయారై, కండె చివరి భాగంలో గింజలు ఏర్పడవు. కండెలోని గింజల వరుసలు తగ్గుతాయి. తర్వాత ఎక్కువ నత్రజని వేసినా ఉపయోగం ఉండదు..కండెలు నిండుగా అధిక దిగుబడి రావాలంటే మాత్రం ఎరువులు తగిన మోతాదులో తప్పక వెయ్యాలి..మొక్కజొన్న పంట గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే మాత్రం వ్యవసాయ నిపుణులు సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news