ఛాతిలో ఎడమవైపు నొప్పి..? కారణాలు ఏమై ఉండొచ్చు..?

-

ఛాతీలో ఎడమ వైపు నొప్పి అనగానే.. అందరికి ఒక క్షణం భయమేస్తుంది. హార్ట్ ఎటాక్ అనుకుంటారు. దీనికి పలు కారణాలు ఉంటాయి. గ్యాస్ వల్ల కూడా ఇలా నొప్పి వస్తుంది. మరి..అలాంటప్పుడు ఆ నొప్పిని దేనికి సంకేతం అనుకోవాలి. గ్యాస్ పెయిన్ అని లైట్ తీసుకుంటే.. కొన్నిసార్లు అది హార్ట్ ఎటాక్ కావొచ్చు. అయితే తరచూ ఇలా నొప్పి వస్తుంటే.. మీరు పరీక్షలు చేయించుకుంటే.. అందులో గుండె ఆరోగ్యం, గ్యాస్ సమస్య లేదని తేలిందంటే.. సమస్యకు కారణం వేరే అయి ఉండొచ్చు..
గుండెజబ్బులు, జీర్ణరసాలు గొంతులోకి ఎగదన్నుకొని రావటం (రిఫ్లక్స్‌) మాత్రమే కాదు.. ఇతరత్రా సమస్యలూ ఛాతీలో ఎడమ వైపున నొప్పికి కారణం అవుతాయి. ఎముకలు, కండరాల సమస్యల వంటివేవైనా ఉన్నాయేమో చూడాల్సి ఉంటుంది. ఏదైనా దెబ్బ తగిలినా, కండరం నలిగినట్టు అయినా ఎడమ వైపు నొప్పి వచ్చే అవకాశముంది. వృద్ధుల్లో సహజంగానే ఎముకలు బోలుగా అవుతుంటాయి. దీంతో చిన్నపాటి ఒత్తిడికి గురైనా ఎముకలు విరగొచ్చు. స్వల్పంగా ఎముక విరిగితే పైకి ఏమీ కనిపించదు…కానీ లోపల నొప్పి వస్తుంటుంది.
ఎదురు రొమ్ములో పలుచటి పొడవాటి ఎముక(స్టెర్నమ్‌)ను, పక్కటెముకను అనుసంధానం చేసే మృదులాస్థి వాచినా నొప్పి పుట్టొచ్చు. దీన్నే కాస్టోకాండ్రయిటిస్‌ అంటారు. ఇది గుండెపోటు, ఇతర గుండెజబ్బుల మాదిరిగానే ఉంటుంది.. ఊపిరితిత్తుల సమస్యతోనూ ఛాతీలో నొప్పి రావొచ్చు. కానీ ఇందులో దగ్గు, జ్వరం, కఫం పడటం వంటివీ ఉంటాయి. కొన్నిసార్లు నాడుల మూలంగానూ నొప్పి (న్యూరాల్జియా) రావొచ్చు. ఏదేమైనా ఛాతీ ఎక్స్‌రే తీస్తే ఎముకల సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుస్తుంది. అవసరమైతే ఎముక స్కాన్‌ కూడా చేయాల్సి ఉంటుంది. డాక్టర్‌ను సంప్రదిస్తే పరీక్షలు చేసి, చికిత్స సూచిస్తారు.
నొప్పి వచ్చే ఏరియా ఒకటే అయినా… అందుకు కారణాలు..బోలెడు ఉన్నాయి. కాబట్టి.. ఎప్పుడూ కూడా.. ఛాతీలో ఎడమవైపు నొప్పిని లైట్ తీసుకోవద్దు. అయితే గ్యాస్, కాకపోతే.. హార్ట్ ఎటాక్ మాత్రమే అనే భ్రమలో ఉండకుండా..స్కాన్ చేయించుకుని అక్కడ ఎముకల పరిస్థితి ఏంటో కూడా తెలుసుకోవాల్సి ఉంటుందంటున్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news