రంజాన్ మాసం: పాకిస్తాన్ లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి !

ప్రపంచం అంతటా ఇప్పుడు ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు మరియు ఉపవాసాలు ఉంటారన్న విషయం తెలిసిందే. కాగా రంజాన్ సందర్భంగా మసీదుల దగ్గర మరియు కొన్ని చోట్ల ఉచితంగా ఆహారపదార్థాలను పంపిణీ చేస్తారు. అలాగే పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో ఆహారాన్ని పంచుతున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. ఆహరం కోసం వచ్చిన ముస్లిం సోదరులు ఎక్కువ కావడంతో చిన్న పాటి తొక్కిసలాట కారణంగా 11 మంది మరణించారు.

 

ఈ ఘటనలో గాయపడిన వారి సంఖ్య తెలియాల్సి ఉంది. వాస్తవంగా అక్కడ ఉన్న వారిలో కొందరు చూడకుండా పక్కనే ఉన్న విద్యుత్ తీగపై కాలు వేయడంతో… భయపడిన పక్కనే వారు పరుగులు తీసే క్రమములో కాలువలో పడి మరణించినట్లు సమాచారం