పామాయిల్ రైతులకు గుడ్ న్యూస్… తెలంగాణలో రికార్డ్ స్థాయిలో పెరిగిన ధరలు

-

ఉక్రెయిన్- రష్యా యుద్ధ పరిణామాల వల్ల ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు, స్టీల్ , ఐరన్, వంటనూనెలు ఇలా అన్నింటి ధరలు పెరిగాయి. యుద్ధ పరిణామాలు వంటింట్లో చిచ్చు రాజేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా సన్ ఫ్లవర్,  పామాయిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. 

ప్రస్తుతం ఇదే రైతులకు ఆనందాన్ని తీసుకువస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పామాయిల్ గెలల ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో పోలిస్తే ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో పామాయిల్ రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్రిల్ నెలలో పామాయిల్ టన్ను గెలల ధరల రూ. 22841గా అధికారులు ప్రకటించారు. గత నెలతో పోలిస్తే టన్నుకు రూ. 3342 పెరిగింది. పక్వానికి వచ్చిన గెలలు మాత్రం కటింగ్ చేసి ఫ్యాక్టరీకి తీసుకురావాలని అధికారులు సూచించారు. నాణ్యమైన గెలలు తీసుకువస్తే ధర మరింతగా పెరుగుతుందని అన్నారు. ఏది ఏమైనా రష్యా- ఉక్రెయిన్ యుద్ధం పామాయిల్ రైతులకు సిరులు కురిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news