గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ శాశనసభ స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య అనంతరం .. అతని కుమారుడు కోడెల శివరాం తండ్రి స్థానాన్ని భర్తీ చేయడానికి రెడీ అవుతున్నాడు. అతను ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు కానీ టీడీపీ అధిష్ఠానం దృష్టిలో పడలేకపోతున్నాడు, తాజాగా కోడెల శివరాం అధిష్టానం పై తనదైన శైలిలో ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు. ఈ మధ్యనే బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ బై బై చెప్పి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే, అనంతరం ఆయనకు చంద్రబాబు సత్తెనపల్లి నియోజకవర్గ పగ్గాలను అందించారు. ఇక కోడెల వర్గం కొందరు లక్ష్మి నారాయణకు సహకరించడం లేదన్నది కాదనలేని వాస్తవం. అందుకే ఈ వర్గంపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన లక్ష్మీనారాయణ వారికి నోటీసులు ఇచేలా చేశారు. ఈ విషయం తెలిసిన కోడెల శివరాం కొన్ని సంవత్సరాలుగా టీడీపీ కోసం పనిచేసి .. పార్టీ జెండాలను మోసిన వారికి నోటీసులు పంపుతారా అంటూ అధిష్టానాన్ని ప్రశ్నించాడు. అంతే కాకుండా శివరాం మాట్లాడుతూ ఇప్పటి వరకు టీడీపీ ఆఫీస్ లో కాలు కూడా పెట్టని కన్నా లక్ష్మి నారాయణకు నోటీసులు ఇవ్వరా అంటూ ప్రశ్నించాడు.
సత్తెనపల్లిలో కోడెల వర్గం లేకుండా చేస్తున్నారా ?
-