BREAKING : సీఎం కేసీఆర్ ను కలిసిన పాల్వాయి స్రవంతి ?

-

BREAKING : మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 వరకు లైనులో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.

ఈ నేపథ్యంలో… ఓ ఫేక్‌ న్యూస్‌ వైరల్‌ గా మారింది. సీఎం కేసీఆర్‌ ను మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. రెండు పార్టీలు ఒక్కటయ్యాయని.. టీఆర్ఎస్‌ అభ్యర్థికి మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి మద్దతు ఇచ్చినట్లు కొంత మంది పోస్టులు పెట్టారు.

అయితే.. మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. దీనిపై సోషల్ మీడియాలో తన పేరిట ఫేక్ ప్రచారం జరుగుతోందని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. తాను సీఎం కేసీఆర్ తో భేటీ అయినట్లు ఫేక్ పోస్టులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news