ప్రపంచంలో సీక్రెట్ డ్యాక్యుమెంట్లను వెలికి తీసి గతంలో వికీలీక్స్ సంచలనం కలిగించింది. ప్రపంచంలో పలు దేశాలు సాగించిని అక్రుత్యాలను జూలియన్ అసాంజే ఈ పేపర్లు వెలుగులోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం ఇదే విధంగా పండోరా పేపర్లు దేశంతో పాటు ప్రపంచంలో సంచలనం కలిగిస్తోంది. పన్ను ఎగవేయడానికి కొంతమంది ఆఫ్ షోర్ కంపెనీలను నెలకొల్పి విదేశాల్లో పెట్టుబడులను పెడుతున్న విషయాలను బయటకు తీసుకువచ్చింది. దీంట్లో దేశంతో పాటు ప్రపంచంతోని పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్, అనిల్ అంబానీతో పాటు పలువురు రాజకీయ నాయకుల పేర్లు మొత్తంగా ఇండియా నుంచి 380 మంది పేర్లు ఉన్నట్లు పండోరా పేపర్స్ వెల్లడించింది. వీరితో పాటు పలు దేశాాల రాజకీయ నాయకులు ఆఫ్ షోర్ కంపెనీలు కలిగి ఉన్నట్లు తేలింది. జోర్డాన్ రాజు, కెన్యా, చెక్ రిపబ్లిక్ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, బ్రిటన్ మాజీ ప్రధాని టోనిబ్లేయర్ వంటి వారి పేర్ల ఉన్నట్లు బహిర్గతం అయ్యాయి.
పండోరా పేపర్స్ కలకలం.. సచిన్ తో సహా ప్రముఖుల పేర్లు
-