ప్రజలకు మరో భారం నెత్తిన పడింది. ఇప్పటికే పలు నిత్యావసరాల వస్తువులతో పాటు పెట్రోల్, డిజిల్, వంటి నూనెలతో సహా సిమెంట్, ఐరన్ ఇలా అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. తాజాగా నిత్యం ప్రజలు వాడేటువంటి పలు మందుల ధరలు కూడా పెరిగాయి. అన్నింటి కన్నా షాకింగ్ విషయం ఏమిటంటే.. మనం ఏచిన్న నొప్పికైనా, జ్వరానికైనా వెంటనే వేసుకునే ‘పారసెటిమాల్’ ధరలు కూడా పెరగబోతున్నాయి. కరోనా కాలంలో దేశంలో అత్యధికంగా వాడింది పారసెటిమాల్ ,డోలో 650 ట్యాబ్లెట్లనే. అయితే ప్రస్తుతం వీటి ధరలు కూడా పెరగనున్నాయి. వీటితో పాటు కరోనా చికిత్సలో ఎక్కువగా వినియోగించిని యాంటీ బయాటిక్ అజిత్రోమైసిన్ ధరలు కూడా పెరగనున్నాయి.
జ్వరం, బీపీ, ఇన్ఫెక్షన్లు తదితర జబ్బులకు వాడే 800 మందుల ధరలు 10.7 శాతం పెరిగినట్లు జౌషధ ధరల సంస్థ వెల్లడించింది. వీటితో పారాసెటిమాల్, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్, ఫెనిటోరియిన్ సోడియం వంటి మందులు ఉన్నాయి. వీటితో పాటు పలు విటమిన్ ట్యాబ్లెట్లకు కూడా ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఎప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం ధరలు పెరిగిన ట్యాబ్లెట్లను కరోనా చికిత్సలో వాడుతున్నారు.