తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా పిల్లల చదువు పట్ల మరియు క్రమశిక్షణ గురించి ఎంతో సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయితే కొందరు పిల్లలు ఎంతో తెలివిగా చదువుతారు, మరికొందరు చదువుకు దూరంగా ఉంటారు. అయితే తల్లిదండ్రులు పిల్లల చదువు పై దృష్టి పెట్టాలని ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. ఈ ప్రక్రియలో భాగంగా, పిల్లలు ఏకాగ్రతను కోల్పోయే అవకాశం ఉంటుంది. దీంతో, ఉదయాన్నే స్కూల్‌కు వెళ్లడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు మానుకుంటే, పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారు. సహజంగా పిల్లలు ఉదయాన్నే నిద్ర లేవడానికి ఇష్టపడరు. అయితే దీని వలన బ్రేక్‌ఫాస్ట్‌పై ప్రభావం పడుతుంది.
ఉదయాన్నే ఆహారాన్ని తినకుండా ఉండడం లేదా మధ్యలో తినడం ఆపేసి స్కూల్ కు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వలన, శరీరంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి. దీంతో ఎంతో నీరసంగా ఉంటారు. పైగా రోజంతా ఏకాగ్రత లేకుండా ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా ఉదయాన్నే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను ఇవ్వడం వలన రక్తంలో చక్కర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి మరియు ఎంతో చురుగ్గా ఉంటారు. పిల్లలకు కనీసం ఏడున్నర నుండి ఎనిమిది గంటల వరకు నిద్ర అవసరం. అయితే పిల్లలను ఉదయాన్నే నిద్ర లేపడం వలన, ఎంతో చిరాకుగా ఉంటారు. పెద్దల కంటే పిల్లలకు నిద్ర ఎంతో అవసరం.
కనుక, సాయంత్రం సమయంలో వీలైనంత త్వరగా డిన్నర్ పూర్తి చేసి తర్వాత నిద్రపోయే విధంగా అలవాటు చేయాలి. ఇలా చేయడం వలన ఉదయాన్నే నిద్ర లేచినప్పటికీ ఎంతో క్రమశిక్షణతో స్కూల్‌కు వెళ్తూ ఉంటారు. చాలా శాతం మంది పిల్లలు స్కూల్‌కు వెళ్లే ముందు టీవీ లేదా మొబైల్‌ను చూస్తూ ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఇలా చేయడం వలన, ఎటువంటి పనులు ప్రారంభించినా, ఏకాగ్రత తగ్గిపోతుంది. దీంతో చదువు పై దృష్టి ఉండదు. కనుక తల్లిదండ్రులు వీటికి దూరంగా ఉంచాలి. సహజంగా పిల్లలు ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. అంతేకాకుండా మంచినీళ్లు కూడా అందించాలి. పిల్లలకు దాహం వేసినప్పటికీ, తగినంత మంచినీరు తీసుకోవడానికి ఆసక్తి చూపరు. కనుక, తగినంత నీరు తాగే విధంగా చూసుకోవాలి. ఇలా చేస్తే, పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది మరియు రోజంతా ఎంతో చురుగ్గా ఉంటారు.