అమ్మో ఐపియల్… తల్లి తండ్రులు ఆవేదన…!

-

ప్రపంచ వ్యాప్తంగా ఐపిఎల్‌ కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇక భారత్ లో అయితే చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు టీవీ చూడని వారు కూడా ఐపిఎల్‌ మ్యాచ్ వస్తుంది అంటే చాలు మ్యాచ్ చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. పనులు అన్ని మానుకుని వచ్చి టీవీ ముందు కూర్చుంటారు. ఇంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఈ ఐపిఎల్‌ తల్లి తండ్రులను భయపెడుతుంది. మరో మూడు నెలల్లో ఐపిఎల్‌ మొదలు కానుంది. ఈ నేపధ్యంలో ఇంట్లో కొన్ని కొన్ని పరిస్థితులు ఆందోళనకరంగా మారిపోతున్నాయి.

ఐపిఎల్‌ బెట్టింగ్ మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న విద్యార్ధులు… ఇళ్ళల్లో వస్తువులు అమ్మేసి బెట్టింగ్‌ల కోసం డబ్బులు దాచుకుంటున్నారు. ఇక పిల్లలకు ఏదైనా కొనివ్వాలి అన్నా సరే, తల్లి తండ్రులు భయపడిపోతున్నారు. భారత్ లో ఐపిఎల్‌ సీజన్ లో జరిగే బెట్టింగ్ ఒక రాష్ట్ర బడ్జెట్ తో సమానంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విద్యార్ధులు ఎక్కువగా బెట్టింగ్ కి బానిస అయిపోతున్నారు అనే విమర్శలు వినపడుతున్నాయి.

పరిక్షలు అయిపోవడం, ఖాళీ గా ఉండటంతో యువత ఐపిఎల్‌ మీద దృష్టి సారిస్తుంది. అదృష్టం బాగున్న వాడు లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. లేని వాడు అమ్మా బాబులు ఇచ్చినవి కూడా అమ్మి రోడ్డు మీద పడుతున్నాడు. ఈ నేపధ్యంలో ఐపిఎల్‌ సీజన్ అయ్యే వరకు తల్లి తండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పిల్లలకు ఇచ్చిన బంగారం స్వాధీనం చేసుకోవడం, బండి పేపర్లు తమ వద్దే ఉంచుకోవడం, ఇంట్లో విలువైన వస్తువులు వాళ్లకు కనపడకుండా దాచడం వంటివి మొదలుపెట్టారు. ఇక వాళ్లకు అప్పు దొరికే మార్గాలను కూడా మూసేస్తున్నారు. తేడా వస్తే మా ఇల్లు, ఒళ్ళు అన్ని గుల్ల అయిపోతున్నాయని… తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news