Breaking : నేడు ప్రారంభం కానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

-

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి ఈ నెల 29 వరకు సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 17 రోజుల పాటు ఉభయ సభల్లో సభా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 25 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని కేంద్రం రెడీ అయ్యింది. ఇందుకు సంబంధించి నిన్న అఖిలపక్ష సమావేశం జరిగింది. శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం కోరింది. ఈ సందర్భంగా.. కొన్ని అంశాలను ప్రస్తావించిన ప్రతిపక్ష పార్టీలు.. వాటిపై చర్చ జరపాలని కేంద్రాన్ని కోరాయి. ఈసారి సమావేశాల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే… పార్లమెంట్ పాత భవనంలో జరిగే చివరి సమావేశాలు ఇవే. నెక్ట్స్ సమావేశాల్ని పార్లమెంటు కొత్త భవనంలో జరపనున్నారు. అసలు.. ఈ సమావేశాల చివరి రోజులను కూడా కొత్త భవనంలో జరపాలని మొదట అనుకున్నా.. అలా వీలు కాకపోవచ్చని తెలుస్తోంది.

India's iconic circular Parliament— Where country began its 'tryst with  destiny' | Mint

ఈ సమావేశాల్లో దేశ సమస్యలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నిర్ణయించింది. దీనిపై సీనియర్ నేత సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్న కీలక సమావేశం నిర్వహించారు. దేశ సమస్యల్ని పార్లమెంట్‌లో లేవనెత్తి, కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీలకు సూచించారు. ఐతే.. భారత్‌ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ సమావేశాలకు రాకపోవచ్చని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news