ఐపీఎల్ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించిన బీసీసీఐ.. ప్ర‌స్తుతానికి అసంపూర్తిగానే..!

-

ప్ర‌తి ఏటా వేస‌వి వ‌స్తుందంటే చాలు.. మ‌న దేశంలో క్రికెట్ ప్రియులు ఐపీఎల్ (ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. త‌మ త‌మ ఫేవ‌రెట్ టీంలు గెల‌వాల‌ని, ట్రోఫీ సాధించాల‌ని కోరుకుంటుంటారు. అయితే ఈ ఏడాది కూడా ఐపీఎల్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ఇవాళ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2019 షెడ్యూల్‌ను బీసీసీఐ విడుద‌ల చేసింది. కానీ 17 మ్యాచ్‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్ర‌మే విడుద‌ల చేశారు.

కాగా ఐపీఎల్ 2019 టోర్న‌మెంట్‌లో మొద‌టి మ్యాచ్‌లో ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్‌, కోహ్లి నేతృత్వంలోని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగుళూరు జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. కాగా మార్చి 23వ తేదీన ఐపీఎల్ 2019 ప్రారంభం కానుంది. అయితే త్వ‌ర‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న దృష్ట్యా తొలి రెండు వారాల షెడ్యూల్‌ను మాత్ర‌మే విడుద‌ల చేశామ‌ని బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు.

ఇక ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం… తొలి రెండు వారాల్లో మొత్తం 17 మ్యాచ్‌లు జ‌రుగుతాయి. అయితే లోక్‌స‌భ ఎన్నికల షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన త‌రువాతే ఐపీఎల్ 2019 త‌దుప‌రి షెడ్యూల్‌ను ప్ర‌క‌టిస్తామ‌ని బీసీసీఐ తెలిపింది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5వ తేదీ మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఐపీఎల్ ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇక స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 24వ తేదీన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో ఆడ‌నుంది. అలాగే హైద‌రాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో మార్చి 29వ తేదీన ఈ సీజ‌న్ తొలి మ్యాచ్ జ‌రుగుతుంది. అందులో రాజ‌స్థాన్‌తో హైద‌రాబాద్ జ‌ట్టు త‌ల‌ప‌డుతుంది..!

Read more RELATED
Recommended to you

Latest news