Pathaan : షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

-

బాలీవుడ్‌ బాద్ షా షారుక్ ఖాన్‌ లేటెస్ట్ మూవీ పఠాన్‌ టీమ్ నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షారుక్ ఖాన్‌ పుట్టినరోజు సందర్భంగా పఠాన్‌ టీజర్‌ను నవంబర్‌ 2న విడుదల చేయాలని మేకర్స్‌ ఫిక్స్‌ అయ్యారట. ‌దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం 2023 జనవరి 25న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త మోషన్‌ పోస్టర్‌ కూడా విడుదల చేశారు.

సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. కండలవీరుడు జాన్‌ అబ్రహాం కీలక పాత్రలో నటిస్తున్నాడు. పఠాన్ చిత్రాన్ని యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. దీపికా-షారుక్ ఖాన్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో పఠాన్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news