పవన్ కల్యాణ్ చిరు ను ఫాలో అవుతున్నాడా.!

-

పవన్ కళ్యాణ్ గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.తన ఫైట్స్, యాక్టింగ్, స్టైల్ తో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం కొన్ని రోజులు రాజకీయాలలో కొన్ని రోజులు సినిమాలు చేస్తూ వస్తున్నాడు.ఇప్పుడు పవన్ కళ్యాణ్  ”హరిహర వీరమల్లు”. ఈ సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత ఇక పవన్ కల్యాణ్ సాహొ డైరెక్టర్ సుజిత్ తో ఒక సినిమా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే.సుజిత్ సినిమా  పాన్ ఇండియా టార్గెట్ గా జపాన్, ఇండియా మధ్య నడిచే గాంగాస్టర్ పాత్ర నభూతో నభవిష్యతి అన్న రీతిలో ఉండబోతుందట. ఈ సినిమా కు డివివి దానయ్య నిర్మాతగా వ్యవరిస్తున్నారు.ఇక ఈ సినిమా నిన్నటి రోజున అధికారికంగా పూజ కార్యక్రమాలు చేసి ప్రారంభం  అయ్యింది. దే కాల్ హిట్ OG అనే వర్కింగ్ టైటిల్ పై స్టార్ట్ చేసారు.

ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ కేవలం ముప్పై రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం అయితే సుజిత్ బుల్లెట్ స్పీడ్ లో పవన్ కల్యాణ్ సీన్స్ కంప్లీట్ చేయాలి.ఇక ఈ సినిమా కోసం డైరెక్టర్ స్క్రిప్ట్ వర్క్ పక్కాగా పూర్తి చేసుకొని రెడీగా ఉన్నట్లు, స్క్రిప్ట్ కూడా సూపర్ గా వచ్చిందని పవన్ కల్యాణ్ స్టయిల్ కు సరిపోయే విధంగా ఉందని అంటున్నారు. దీని కోసం చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా లో పాత వింటేజ్ లుక్ ను ఫాలో అయ్యి పవన్ కల్యాణ్ కూడా అదేవిధంగా పాత పవన్ కల్యాణ్ లా మెకోవర్ అయ్యాడని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news