ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు, చెల్లింపులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు రూ. 4 లక్షల కోట్లుగా లోక్సభలో ఇచ్చిన గణాంకాలలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి పేర్కొన్నారని తెలిపారు. ఏపీ కార్పొరేషన్ సహా అన్ని రకాల రుణాలు కలిపితే రాష్ట్ర అప్పులు రూ. 8 లక్షల కోట్లకు పైగానే ఉంటాయని రామకృష్ణ అంచనా వేశారు.
కార్పొరేషన్ల అరుణ వివరాలను కాగ్ అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. కేంద్రం చెబుతున్న లెక్కలకు.. వాస్తవ హక్కులకు దాదాపు నాలుగు లక్షల కోట్లకు పైగా వ్యత్యాసం ఉందన్నారు. ఏపీ అప్పులు, పెండింగ్ బకాయిల చెల్లింపులు తదితర వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ లెక్కల ప్రకారం 2018 లో ఏపీ అప్పు రూ. 2.29 లక్షల కోట్లు కాగా.. ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ. 3.98 లక్షల కోట్లకు పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ నిన్న లోక్సభలో బదులిచ్చింది.