కేవలం నెల రోజులు..అంతే..ఈ నెల రోజుల్లోనే పవన్ గ్రాఫ్‌ని వైసీపీ అమాంతం పెంచేసింది. అదేంటి పవన్ గ్రాఫ్ వైసీపీ పెంచడం ఏంటని అంత అనుకోవచ్చు. మరి అదే వైసీపీ టాలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్షాల బలం పెంచుతుంది వైసీపీనే. గత ఎన్నికల్లో టీడీపీ చావుదెబ్బతింది. ఆ ఓటమి నుంచి బయటపడటానికి టీడీపీ కష్టపడుతుంది. అలా కష్టపడుతున్న టీడీపీని ఇంకా ఎక్కువ టార్గెట్ చేసి..వ్యక్తిగతంగా నాయకులని టార్గెట్ చేసి..వారిపై సానుభూతి పెరిగేలా చేసి..పార్టీ బలం పెరిగేలా చేశారు.
చంద్రబాబు, లోకేష్ యాత్రలని అడ్డుకోవడం, వారిని వ్యక్తిగతంగా తిట్టడం, ఫ్యామిలీని లాగి తిట్టడం, వివాదాస్పద కామెంట్లు చేయడం లాంటి చేశారు. ప్రతిపక్ష నేతలు..ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వాటికి కౌంటర్లు ఇవ్వాలి..కానీ వైసీపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి..ఇంకా ప్రతిపక్ష బలం పెంచింది. పవన్ కల్యాణ్ విషయంలో కూడా అదే చేసింది..ఆయన పెళ్లిళ్లపై ఎలాంటి కామెంట్లు చేశారో తెలిసిందే.
ఇక విశాఖ ఘటన తర్వాత ఇంకా సీన్ మారిపోయింది. పవన్‌ని జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా పోలీసుల చేత అడ్డుకుని, పవన్‌ని హోటల్‌లోనే నిర్భదించారు. ఆ తర్వాత నుంచి పవన్ ఉగ్రరూపం దాల్చారు. ఇంకా అరెస్ట్ అయిన పర్లేదు అని..వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతలపై పవన్ ఏ స్థాయిలో స్పందించారో చెప్పాల్సిన పని లేదు. పవన్‌ని అడ్డుకుందామని చెప్పి..ఆయన బలం ఇంకా పెంచుతున్నారు.
నెల రోజుల్లోనే పవన్ గ్రాఫ్ బాగా పెరిగిందని తెలుస్తోంది..పైగా చంద్రబాబు కలవడంతో టీడీపీ శ్రేణులు సైతం పవన్‌కు మద్ధతుగా నిలబడుతున్నారు. అటు ప్రజల్లో కూడా పవన్‌పై సానుభూతి పెరిగింది. తమ కోసం పవన్ పోరాటం చేస్తున్నారని, కానీ వైసీపీ ప్రభుత్వం ఆయన్ని అడ్డుకునేందుకు చూస్తుందనే భావన ప్రజల్లో కనిపిస్తోంది. పైగా వైసీపీ నేతల బూతులు తిట్టడం కూడా పవన్‌కే ప్లస్. ఒకవేళ పవన్ కూడా తిడుతున్నారని వైసీపీ నేతలు అంటుంటే…ప్రజలు తప్పు లేదులే వైసీపీ వాళ్ళకు అలాగే బదులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పవన్ గ్రాఫ్‌ని వైసీపీ నేతలే పెంచేశారు.