ఏపీలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాదాపు క్లారిటీ ఇచ్చేశారని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన-బిజేపి కలిసి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అంటే 2014లోని కాంబినేషన్ మళ్ళీ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఇదే అంశాన్ని ఢిల్లీ పెద్దలకు కూడా పవన్ వివరించారు. ఎలాగో బిజేపి-జనసేన పొత్తులో ఉన్నాయి..కానీ ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే గెలవడం కష్టమని పవన్ భావిస్తున్నారు..అందుకే టిడిపితో కలిసి ముందుకెళితే బెటర్ అని బిజేపి పెద్దలకు క్లారిటీ ఇచ్చారు.
అయితే బిజేపి పెద్దలకు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. బిజేపి సొంతంగా బలపడాలని అనుకుంటున్నారు. అలాగే జనసేనతో పొత్తు ఉండాలని భావిస్తున్నారు..కానీ టిడిపితో కలవడానికి రెడీగా ఉన్నట్లు కబడటం లేదు. కాకపోతే వచ్చే ఎన్నికల్లో బిజేపి-జనసేన కలిసి పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి టిడిపి ఓడిపోతుంది..అలాగే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు టిడిపి పని అయిపోతుందని..ఇంకా ఆ సమయంలో బిజేపి-జనసేన బలమైన శక్తిగా ఎదిగే ఛాన్స్ ఉందని పవన్ కు బిజేపి పెద్దలు చెబుతున్నారట.
కానీ ఇప్పటికే జనసేన పదేళ్ళ పైనే అధికారంలో లేదు. ఈ సారి కూడా రాకపోతే జనసేనకు రిస్క్. ఒకవేళ టిడిపి ఓడిపోతే మళ్ళీ ఇబ్బందులు పడుతుంది..కానీ ఆ పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో బలం ఉంది కాబట్టి..ఎలాగోలా పుంజుకునే ఛాన్స్ ఉంది. జనసేన అలా కాదు. అందుకే ఇప్పుడే టిడిపితో కలిసి అధికారంలోకి రావాలనేది పవన్ ఆలోచన.
ఒకవేళ టిడిపితో పొత్తు బిజేపి ఒప్పుకోకపోతే..ఆ పార్టీని పక్కన పెట్టి టిడిపితో కలవడానికి పవన్ రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏది చేసిన బిజేపి చేతుల్లోనే ఉంది. చివరికి ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో చూడాలి.