బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ “ముందస్తు అరెస్టు”పై “లోక్సభ కార్యాలయం “బులెటిన్” విడుదల చేసింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఇచ్చిన సమాచారాన్ని “బులెటిన్” రూపంలో వెల్లడించింది లోకసభ సెక్రటేరియట్. సీఆర్పీసీ సెక్షన్ 151 ప్రకారం “ప్రివెంటివ్ అరెస్టు” ( ముందస్తు అరెస్ట్) చేసినట్టు కరీంగనర్ పోలీసులు సమాచారం ఇచ్చారని బులిటెన్ లో తెలిపారు.
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నందున బండి సంజయ్ ను అర్థరాత్రి 12.15 గంటలకు అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. కరీంనగర్లో అరెస్టు చేసి రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. ఆ తర్వాత, “పోలీస్ కస్టడీ” నుంచి కరీంనగర్ పోలీసులు విడిచిపెట్టినట్టు లోక్సభ సచివాలయం బులెటిన్ లో వెల్లడించారు.