నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు ఇస్తారు ఏంటి అనేది తెలియడం లేదు. దీనిపై ఇప్పుడు సర్వత్రా కూడా చర్చలు జరుగుతున్నాయి. జనసేన పార్టీని జాతీయ పార్టీగా మార్చే క్రమంలో ఈ మధ్య కాలంలో కాస్త సమాలోచనలు ఎక్కువగా చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల్లో కాస్త సీరియస్ గానే ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల మీద ఆయన దృష్టి పెట్టవచ్చు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకపోయినా ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిధిలో కొంతమంది కీలక నేతలకు కీలక బాధ్యతలను ఇచ్చారు పవన్ కళ్యాణ్. నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఆయన కోదండ రామ్ కు మద్దతిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆయన మద్దతు కోసం ఎదురు చూస్తోందని సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడంతో హైదరాబాద్ పరిధిలో ఉన్న కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేశారు. అయితే ఇది జనసేన పార్టీ విజయం కొంత మంది కార్యకర్తలు సోషల్ మీడియాలో చెప్పుకోవడం విస్మయానికి గురిచేసింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ కచ్చితంగా కోదండరాం లేదా టిఆర్ఎస్ పార్టీలకు మద్దతు ఇవ్వొచ్చని లేకపోతే సొంత అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.