కల్యాణ్ ‘బాబు’కు కమలం దూరమే..?

-

ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కట్ అవుతుందా? బాబుతో పవన్ కలిస్తే…బీజేపీ సైడ్ అయిపోతుందా? అంటే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న చర్చలని బట్టి చూస్తే అదే నిజమయ్యేలా ఉంది..ప్రస్తుతానికి బీజేపీ-జనసేన పొత్తులో ఉన్న విషయం తెలిసిందే..ఏదో అఫిషియల్ గా పొత్తులో ఉన్నారు గాని..ఏ రోజు కూడా కలిసి మాత్రం ఒక్క కార్యక్రమం చేయలేదు..ఎవరికి వారు సెపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. పొత్తులో ఉన్నట్లు ఎప్పుడు రాజకీయం చేయలేదు.

పైగా గత కొంతకాలం నుంచి జనసేన…టీడీపీకి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది..అటు టీడీపీ సైతం..జనసేనని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తుంది..కానీ టీడీపీ మాత్రం బీజేపీకి దూరంగానే ఉంది…అసలు టీడీపీ కార్యకర్తలు…బీజేపీతో పొత్తు అంటే ఫైర్ అయిపోయేలా ఉన్నారు..ఇటు బీజేపీ సైతం…టీడీపీతో కలవడానికి ఇష్టపడటం లేదు..ఇప్పటికే చంద్రబాబుని నమ్మి మోసపోయామని…మళ్ళీ మళ్ళీ బాబుని నమ్మి మోసపోలేమని బీజేపీ నేతలు చెబుతున్నారు.

అంటే ఇక్కడ వరకు అంతా క్లియర్..టీడీపీ-బీజేపీలు కలవడం కష్టమని తెలుస్తోంది..అయితే టీడీపీ-జనసేన కలిసేలా ఉన్నాయి..అయితే జనసేన అఫిషియల్ గా బీజేపీతో పొత్తులో ఉంది…ఒకవేళ ఆ పార్టీ..టీడీపీతో కలవాలంటే…ఖచ్చితంగా బీజేపీని వదిలి రావాల్సిందే. అయితే ఇప్పటికే బీజేపీకి దూరం జరగే దిశగానే జనసేన పయనిస్తున్నట్లు కనిపిస్తోంది..ఇటీవల పవన్ కల్యాణ్ ని సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని జనసేన పార్టీ…బీజేపీకి అల్టిమేటం జారీ చేసింది. కానీ దీనిపై బీజేపీ ఏ మాత్రం స్పందించలేదు…అసలు పట్టించుకోవడం లేదు కూడా. తమ పార్టీలోనే సీఎం అభ్యర్ధులు ఎక్కువగా ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీకి వచ్చారు…రాజమండ్రిలో సభ కూడా ఏర్పాటు చేశారు…అయితే ఆ సభలో మిత్రపక్షమైన జనసేన పేరుగానీ, ఆపార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రస్తావనకు రాకపోవడం గమనార్హం. నడ్డా నోట జనసేనకు అనుకూలంగా ఏదైనా మాట వస్తుందని ఆ పార్టీ భావించింది, కానీ నడ్డా జనసేన గురించి గాని, పవన్ గురించి గాని ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే సీఎం అభ్యర్ధి విషయంపై కూడా స్పందించలేదు…దీని బట్టి చూస్తే పవన్ ని బీజేపీ లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది…ఒకవేళ పవన్…చంద్రబాబుతో కలిస్తే జనసేనకు బీజేపీ దూరమయ్యేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news