Pawan Kalyan : మరో యంగ్ డైరెక్టర్‌కు పవన్ కల్యాణ్ అవకాశం..ఈ సారీ రీమేక్ ఫిల్మ్!

-

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’గా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు ఓకే చెప్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘భీమ్లా నాయక్’ సూపర్ హిట్ అయింది కూడా. ఇక నెక్స్ట్ ఫిల్మ్స్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న పవన్.. మరో వైపున తన పార్టీ జనసేన కార్యక్రమాలు కూడా చూసుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ మొదటి నుంచి కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. పూరీ జగన్నాథ్ కు దర్శకుడిగా అవకాశం ఇచ్చింది పవన్ కల్యాణే అని అందరికీ విదితమే. ఈ క్రమంలోనే జనసేనాని ఈ తరం యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి కూడా మొగ్గు చూపుతుంటారు. వేణు శ్రీరామ్, సాగర్.కె.చంద్ర వంటి వారికి సినిమాల పరంగా తక్కువ అనుభవం ఉన్నప్పటికీ ఆయన్ను డైరెక్ట్ చేసే అవకాశమిచ్చారు.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ మరో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ కు చాన్స్ ఇచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. పవన్ ప్రజెంట్ ‘హరిహర వీరమల్లు’, ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాల షూటింగ్స్ లో పాల్గొనేందుకు ప్లాన్స్ వేసుకుంటున్నారు.

ఈ రెండు చిత్రాల షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సురేందర్ రెడ్డి ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ ఫిల్మ్ షూట్ లో పాల్గొంటారు. కాగా, తాజాగా అందుతున్న వార్తల ప్రకారం.. ‘రన్ రాజా రన్, సాహో’ ఫేమ్ డైరెక్టర్ సుజిత్ కు పవన్ చాన్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తు్న్నారట. ఈ విషయం తెలుసుకుని పవన్ అభిమానులు సంబురపడుతున్నారు.

‘లార్గోవిచ్’ అనే ఫిల్మ్ రీమేక్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు చేయడంలో సుజిత్ బెటర్ గా డీల్ చేస్తాడని పవన్ కల్యాణ్ కు సినీ ప్రముఖులు కొందరు చెప్పినట్లు వినికిడి. మరో వైపున కోలీవుడ్ యాక్టర్, డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కించిన ‘వినోదియ సీతం’ ఫిల్మ్ ను కూడా తెలుగులో పవన్ కల్యాణ్ రీమేక్ చేయాలని భావిస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఇందులో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కీ రోల్ ప్లే చేస్తారని అంటున్నారు. అయితే, ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version