సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా అధికారం చేజిక్కించుకోలేని కులాల్లో కాపు కులం ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా రిజర్వేషన్లు, ఫీజు రీ-ఇంబర్సుమెంట్ కోసం అడుక్కోవడం దేనికి..? అని ప్రశ్నించారు. దేహీ అనే పరిస్థితి ఎందుకొచ్చిందో ఆలోచించాలన్నారు. కులాల పేరు చెప్పుకునే నేతలు పదవులు సంపాదించుకుంటున్నారు తప్ప.. కులాలకు ఉపయోగ పడడం లేదని మండిపడ్డారు పవన్ కళ్యాణ్.
కాపులు అధికారంలోకి వస్తే మిగిలిన కులాలను తొక్కేస్తారనే దుష్ప్రచారంతో నష్టం జరిగిందన్నారు. కాపులు పెద్దన్న పాత్ర వహించాలని.. అప్పుడు ఊళ్లో ఏ కష్టం వచ్చినా కాపుల దగ్గరకే వస్తారని అన్నారు. ఇది అలవర్చుకుంటే అధికారం మీ దగ్గరకు వస్తుందన్నారు పవన్ కళ్యాణ్. సమాజంలో విడదీసే మనుషులే ఎక్కువ అని.. కలిపే వాళ్లు తక్కువన్నారు. 2009లో జరిగిన ఘటనలు నాలో పంతం పెంచాయన్నారు పవన్ కళ్యాణ్. సంఖ్యా బలం ఎక్కువ ఉన్న కులాల్లో ఐక్యత ఉండదని చాలా మంది అన్నారని.. అధికారం చూడని ఏ కులం కూడా ఈ మాట పడకూడదన్నారు.