ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తుంది.. ఈ జీవరాసిలో అనంతమైన మొక్కలు ఉన్నాయి.. వాటి పేర్లు, ఉపయోగాలు కూడా మనకు సరిగ్గా తెలియదు. కొన్ని మొక్కలు ఖరీదు లక్షల్లో ఉంటాయి.. అత్యంత ఖరీదైన కలపగా గంధం ఉండేది..కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌లో ఇంకోటి చేరింది.. దీని ధర కేజీ 7-8 లక్షలు ఉంటుందట. ఈ మొక్క కానీ ఇంట్లో ఉందంటే.. ఇగ మీరు ఏం పని చేయకుండా.. సంపాదించేయొచ్చుగా..! ఈ చెట్లు ప్రపంచంలోనే అత్యంత అరుదైనవిగా ప్రసిద్ధి చెందాయి. అందుకే వాటి ధరలు ఆకాశాన్ని అంటాయి. మిగతా చెట్లతో పోలిస్తే ఈ చెట్ల సంఖ్య చాలా తక్కువ, అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది..
ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్ పేరుతో పిలవబడే ఈ ప్రత్యేకమైన చెట్టు గురించి ముఖ్యమైన విషయాలు ఏంటంటే.. ఈ చెట్టు సగటు ఎత్తు 25-40 అడుగులు ఎత్తు వరకు పెరుగుతుంది. ప్రపంచంలోని 26 దేశాల్లో ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్ చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు ఆఫ్రికా ఖండంలోని మధ్య, దక్షిణ భాగాలలో ఎక్కువగా ఉంటుంది.. అయితే, ఈ చెట్టు పూర్తిగా పెరగడానికి మొత్తం 60 ఏళ్లు పడుతుందట. కెన్యా, టాంజానియా వంటి దేశాల్లో ఈ చెట్టు ఎక్కువగా ఉంది. కలప స్మగ్లర్లు సాధారణంగా ఈ ప్రాంతంలో ఈ చెట్టు కోసం చాలా కలపను కాల్చివేస్తారు. ఈమధ్య కాలంలో ఈ ఖరీదైన కలప కోసం స్మగ్లర్లు చెట్లను నరికివేయడం వల్ల ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఈ చెట్లు, కలప కనమరుగయ్యే పరిస్థితి ఉందని ఆయా దేశాల అటవీశాఖ అధికారులు అంటున్నారు.
అయితే మీకు డౌట్ రావొచ్చు.. ఈ కలపను పెంచడానికి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, పోషకాలు బాగా పెట్టాలి అనుకుంటారేమో.. సైంటిస్టులు కూడా ఇదే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. దీనికి ఎలాంటి వాతావరణం అనుకూలమో తెలుసుకుని అక్కడ ఈ మొక్కలను విస్తరించే ప్లాన్‌లో ఉన్నారు.