జనసేన అధినేత పవన్ త్వరలోనే ఓ షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నారట. త్వరలో బీజేపీలో జనసేనను విలీనం చేస్తారని వార్తలు వస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కొద్ది రోజులపాటు బయటకు రాలేదు. ఆ తరువాత అడపాదడపా ఆయన వార్తల్లో కనిపిస్తున్నారు. అయితే కేవలం ఒక్క సీటు వచ్చినంత మాత్రాన బాధపడమని, ప్రజల మధ్యన ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు పోరాటం చేస్తామని పవన్ గతంలో ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీలో జనసేన మనుగడ కష్టమని భావిస్తున్న పవన్ కల్యాణ్ త్వరలోనే ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.
జనసేన అధినేత పవన్ త్వరలోనే ఓ షాకింగ్ నిర్ణయం తీసుకోనున్నారట. త్వరలో బీజేపీలో జనసేనను విలీనం చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు కారణం లేకపోలేదు. మొన్నీ మధ్యే అమెరికాలోతానా సభలకు వెళ్లిన పవన్ కల్యాణ్‌ను బీజేపీ అగ్రనేత రాంమాధవ్ కలిశారట. ఈ సందర్భంగా వారి మధ్య పార్టీల పరంగా కొంత చర్చ కూడా జరిగిందట. అందులో భాగంగానే రాంమాధవ్ జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని పవన్‌ను కోరారట. అయితే పవన్ అందుకు అప్పుడు సమాధానం చెప్పకపోయినా త్వరలోనే అదే విషయంపై పునరాలోచించి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
అయితే జనసేన బీజేపీలో విలీనం అయినా.. కాకున్నా.. బీజేపీకి పెద్దగా ఒరిగే లాభం ఏమీ ఉండదు. కాకపోతే విలీనం అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కొంత వరకు పోటీనివ్వవచ్చని బీజేపీ నేతల అభిప్రాయం. అదే బీజేపీలో జనసేన విలీనం అయితే.. పవన్‌కే పెద్దగా లాభం కలుగుతుంది. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో పవన్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ ముందుకు వెళ్లవచ్చు. ఇక అటు కేంద్రంలోనూ బీజేపీయే అధికారంలో ఉంది కనుక.. పవన్ ఇటు ఏపీలో బలమైన ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించవచ్చు. దీంతో అది పవన్‌కే కాదు, బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది.
కాగా మరోవైపు జనసేన పార్టీ నేతలు మాత్రం పార్టీని బీజేపీలో కలపడం కన్నా… బీజేపీతో సఖ్యతగా ముందుకు వెళ్తేనే బాగుంటుందన్న మరొక కొత్త ప్రతిపాదనను పవన్ ముందుకు తెచ్చారట. కాగా ఈ విషయాలపై పవన్ గత రెండు రోజులుగా పార్టీ సమీక్షా సమావేశాల్లో చర్చిస్తున్నారని తెలిసింది. మరి జన సైనికుడు త్వరలో ఏ నిర్ణయం తీసుకుంటాడో.. వేచి చూస్తే తెలుస్తుంది..!