హరిరామ జోగయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

-

కాపు సంక్షేమసేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. “సీనియర్ రాజకీయ కోవిదుడు, సామాజికవేత్త, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిని కాంక్షించే శ్రీ చేగొండి హరిరామ జోగయ్యగారికి గౌరవపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ జోగయ్య గారు నాటి తరం – నేటి తరం రాజకీయాలకు వారధి వంటి వారు. చట్టసభల సభ్యునిగా, మంత్రివర్యునిగా తాను నిర్వర్తించిన పదవులకు వన్నె తెచ్చారు. రాజకీయాలలో దైర్యం, మనోనిబ్బరం, ఆత్మాభిమానంతో ఎలా పని చేయవచ్చునో ఆయన ఆచరించి చూపారు.

జనసేన దినదినాభివృద్దికి శ్రీ జోగయ్య గారు ఇచ్చే సలహాలు ఎంతో ఉపయోగకరమైనవి. ఎనిమిదిన్నర దశాబ్దాల వయస్సులో కూడా విశ్రాంతికి పరిమితం కాకుండా ఆయన ఇప్పటికీ చేస్తున్న రాజకీయ శ్రమ కొనియాడతగినది. ఈసారి ఆయన తన జన్మదినాన్ని అణగారిన వర్గాల మధ్య జరుపుకోవడం ఆయనలోని సామాజిక ఔచిత్యానికి నిదర్శనంగా భావిస్తున్నాను. ఆయనకు ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని, సంపూర్ణాయుష్షును ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను” అని సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version